వెబ్‌సైట్‌లో అసత్య వార్తలు రాసినందుకు ఎడిటర్‌ అరెస్ట్.. 14 రోజుల పోలీసు కస్టడీ

  • ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా వార్తలు
  • కర్ణాటకలో ఏ మతానికి చెందిన వారికీ రక్షణ లేదంటూ న్యూస్‌
  • పోస్ట్‌కార్డ్ వెబ్‌సైట్ నిర్వాహకుడిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్ట్‌కార్డ్ వెబ్‌సైట్ నిర్వాహకుడు మహేశ్ విక్రమ్ హెగ్డే కథనాలు రాయడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ జైన గురువుపై ముస్లిం యువకుడు దాడి చేసినట్లు ఇటీవల ఆయన రాసిన కథనాలు అలజడి రేపాయి. జైనమత గురువు ఉపాధ్యాయ మయాంక్ సాగర్ జీ మహారాజ్ హాసన్.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతోన్న సమయంలో ఓ ముస్లిం యువకుడు మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ జైన గురువును ఢీకొట్టాడని, అనంతరం దాడికి పాల్పడ్డాడని, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు పాలనలో తమ రాష్ట్రంలో ఏ మతానికి చెందిన వారికీ రక్షణ లేదని ఆయన వార్తలు రాశాడు.

సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సదరు ఎడిటర్ విక్రమ్‌ హెగ్డేను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చామని, నిందితుడిని 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారని పోలీసులు తెలిపారు. 
Go Back to Shorts
fake news
Karnataka
editor
Police

More Telugu News